టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ బలోపేతానికి.. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం

టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ బలోపేతానికి..  ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం
  • బడ్జెట్​లో ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: కార్మిక- ఆధారిత టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ రంగం బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంను ప్రకటించింది. అలాగే, మెగా టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ పార్కుల ఏర్పాటును కూడా ప్రతిపాదించింది. ఈ మేరకు కార్మిక -ఆధారిత వస్త్ర రంగానికి 5 ఉప -భాగాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంను ప్రతిపాదిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 

ఈ ఐదు ఉప భాగాల కింద.. పట్టు, ఉన్ని, జనపనార, మ్యాన్-మేడ్ ఫైబర్లు, న్యూ -ఏజ్ ఫైబర్‌‌‌‌‌‌‌‌ వంటి సహజ ఫైబర్‌‌‌‌‌‌‌‌లలో స్వయం సమృద్ధి కోసం ఆమె ‘నేషనల్ ఫైబర్ స్కీం’ను ప్రకటించారు. ట్రెడిషనల్ క్లస్టర్లను ఆధునీకరించడానికి మెషినరీ, టెక్నాలజీ అప్‌‌‌‌‌‌‌‌గ్రేడేషన్, కామన్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్లకు క్యాపిటల్ సపోర్ట్ ఇచ్చే ‘టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పాన్షన్ అండ్ ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌మెంట్ స్కీమ్’ను ప్రతిపాదించారు. ఇప్పటికే ఉన్న స్కీమ్‌‌‌‌‌‌‌‌లను ఇంటిగ్రేట్ చేసి.. చేనేత, చేతివృత్తులకు టార్గెటెడ్ సపోర్ట్ అందించే ‘నేషనల్ హ్యాండ్‌‌‌‌‌‌‌‌లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ ప్రోగ్రాం’ను కూడా ప్రతిపాదన చేశారు. గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా పోటీపడగలిగిన, సస్టైనబుల్ టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్స్ అండ్​ అపారెల్స్‌‌‌‌‌‌‌‌ను ప్రోత్సహించడానికి ‘టెక్స్-ఈకో ఇనిషియేటివ్’ను ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. 

వీటితో పాటు ఇండస్ట్రీ, అకడమిక్ సంస్థలతో టై-అప్‌‌‌‌‌‌‌‌ల ద్వారా టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ స్కిల్లింగ్ ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌ను ఆధునీకరించడానికి, అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేయడానికి ‘సమర్థ్ 2.0’ను ప్రతిపాదించారు. ‘‘అదనంగా, చాలెంజ్ మోడ్‌‌‌‌‌‌‌‌లో మెగా టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ పార్కుల ఏర్పాటును ప్రతిపాదిస్తున్నాను. ఇవి టెక్నికల్ టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్స్‌‌‌‌‌‌‌‌లో వాల్యూ అడిషన్‌‌‌‌‌‌‌‌పై కూడా దృష్టి పెట్టవచ్చు’’ అని నిర్మల చెప్పారు. 

అలాగే, ఖాదీ, హ్యాండ్‌‌‌‌‌‌‌‌లూమ్, హ్యాండిక్రాఫ్ట్స్‌‌‌‌‌‌‌‌ను బలోపేతం చేయడానికి ‘మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ ఇనిషియేటివ్’ను ప్రారంభిస్తామని ప్రకటించారు. ‘ఇది గ్లోబల్ మార్కెట్ లింకేజ్, బ్రాండింగ్‌‌‌‌‌‌‌‌కు సహాయపడుతుంది. ట్రైనింగ్, స్కిల్లింగ్, ప్రాసెస్, ప్రొడక్షన్ నాణ్యతను స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌లైన్ చేసి సపోర్ట్ అందిస్తుంది. ఇది మన చేనేత కార్మికులు, విలేజ్ ఇండస్ట్రీస్, వన్-డిస్ట్రిక్ట్-వన్-ప్రొడక్ట్ ఇనిషియేటివ్, గ్రామీణ యువతకు ప్రయోజనం చేకూరుస్తుంది’ అని ఆర్థిక మంత్రి నిర్మల వివరించారు.