ఇలాంటి స్విమ్మింగ్ పూల్‌ను ఎప్పుడూ చూసుండరు!

ఇలాంటి స్విమ్మింగ్ పూల్‌ను ఎప్పుడూ చూసుండరు!

ధార్చూలా: ప్రముఖ వ్యాపారవేత్త, మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా సోషల్ మీడియాలో చేసే పోస్టులు అందరినీ ఆకట్టుకుంటాయి. బిజినెస్ వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే ఆయన.. తీరిక దొరికినప్పుడల్లా ట్విట్టర్‌ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా మహింద్రా చేసిన ఓ ఫొటో వైరల్‌ అవుతోంది. పచ్చని ప్రకృతికి పొదరిల్లు లాంటి ఉత్తరాఖండ్‌ కొండల్లో ఉన్న అందమైన స్విమ్మింగ్ పూల్‌ ఫొటోను ఆయన షేర్ చేశారు. ఇలాంటి పూల్‌ను తానెప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ లొకేషన్‌కు వెళ్లాలని ఉందని, తన ట్రావెల్ బకెట్ లిస్ట్‌లో దీన్ని చేరుస్తున్నానని మహింద్రా పేర్కొన్నారు. అందమైన ఈత కొలను ఉన్న ఈ లొకేషన్ ఉత్తరాఖండ్‌లోని ధార్చూలాలో ఉంది.