భూ వివాదంలో లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ ఫ్యామిలీ.. రక్షణ కల్పించమని కలెక్టర్కు రిక్వెస్ట్

భూ వివాదంలో లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ ఫ్యామిలీ.. రక్షణ కల్పించమని కలెక్టర్కు రిక్వెస్ట్

టాలీవుడ్ టాప్ లిరిసిస్ట్ లలో అనంత్ శ్రీరామ్ ఒకరు. వరుస అవకాశాలతో మంచి సక్సెస్లో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అనంత్ శ్రీరామ్కి సంబంధించిన ఓ రెండు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి పెద్ది సినిమా నుంచి వచ్చిన ‘హల్లల్లల్లో.. హల్లో’ స్పెషల్ సాంగ్ రికార్డు వ్యూస్తో దూసుకెళ్లడం. మరోకటి తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించండి అంటూ జిల్లా కలెక్టరేట్‌లో కంప్లైంట్ ఇవ్వడం. ఇందులో రెండో విషయంపై నెటిజన్లు ఎక్కువ ఆరాతీస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లో కంప్లైంట్ చేశారు. యలమంచిలి మండలం దొడ్డిపట్లలోని తన కుటుంబానికి చెందిన 5 సెంట్ల ఉమ్మడి స్థలం ఆక్రమించారంటూ ప్రజా సమస్యల వేదికలో పాల్గొని జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి వినతిపత్రం అందించారు.

ALSO READ :  హీరోయిన్ రంభ ఇంట విషాదం..

ప్రస్తుతం స్థల వివాదం కేసు కోర్టులో ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయని, వృద్ధులైన తల్లిదండ్రులకు భద్రత కల్పించాలని ఆయన అధికారులను కోరారు. ఫిర్యాదుపై జిల్లా అధికారులు స్పందిస్తూ.. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్, పోలీసులను ఆదేశించారు. ఇపుడు ఈ భూవివాదం జిల్లా స్థాయిలో చర్చనీయాంశమైంది.