Lenin 2 Days Box Office : అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా 'లెనిన్'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

Lenin 2 Days Box Office : అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా 'లెనిన్'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ జాక్ పాట్ కొట్టేశారు. ఎంతో కాలంగా ఒక సాలిడ్ హీట్ కోసం ఎదురు చూస్తున్న అక్కినేని వారసుడు కష్టానికి ఫలితం దక్కింది.  అఖిల్ , భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'లెనిన్' ( Lenin ) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ జూలై 10న థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ను సొంతం చేసుకుంది.  కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 37.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం షాక్‌కు గురిచేసింది.

రూ. 50 కోట్ల క్లబ్ లో.. 

అఖిల్ ఊరమాస్ లుక్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. మొదటి రోజు రూ. 16.7 కోట్ల ఓపెనింగ్స్‌తో అదరగొట్టిన 'లెనిన్', రెండవ రోజు మౌత్ టాక్‌తో మరింత పుంజుకుని ఏకంగా రూ. 20.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. ట్రెండ్ చూస్తుంటే ఆదివారం కలెక్షన్లు మరింత ఊపు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా ఈజీగా రూ. 50 కోట్ల క్లబ్‌ లో చేరిపోతుందని ట్రేడ్ నిపుణులు లెక్కలు వేస్తున్నారు.

 

ఊరమాస్ రివెంజ్ డ్రామా..

డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి ఒక పక్కా రూరల్ రివెంజ్ డ్రామాగా ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అఖిల్ నటనలో చూపించిన ఇంటెన్సిటీ, యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో ఈలలు వేయిస్తున్నాయి. అఖిల్ సరసన మెరిసిన గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో యూత్‌ను కట్టిపడేసింది. వీరికి తోడు సపోర్టింగ్ కాస్ట్‌లో ప్రమోద్ పంజు, శివాజీ, బ్రహ్మాజీ, సునీల్, ఈశ్వరీ రావు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

►ALSO READ | మాకీపూర్ విలేజ్ మిషన్.. 'సూపర్ సుబ్బు' సక్సెస్ అయ్యాడా? సిరీస్ కథ ఇదే!

థమన్ మ్యూజిక్ విధ్వంసం..

ఈ సినిమాకు మరో ప్రధాన పిల్లర్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్. ఆయన అందించిన సాంగ్స్, ముఖ్యంగా థియేటర్లు దద్దరిల్లేలా ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను నెక్స్ట్‌ లెవెల్‌కు తీసుకెళ్లింది. కింగ్ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్, ప్రముఖ నిర్మాత నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచిన 'లెనిన్'తో అక్కినేని ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సంబరాలు చేసుకుంటున్నారు..