ఇండస్ట్రీలో ఉండాలంటే ఆపని చేయాల్సిందే.. అనన్య షాకింగ్ కామెంట్స్

ఇండస్ట్రీలో ఉండాలంటే ఆపని చేయాల్సిందే.. అనన్య షాకింగ్ కామెంట్స్

అనన్య నాగళ్ళ(Ananya Nagalla).. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన లేటెస్ట్ గ్లామరస్ ఫోటో షూట్స్ తో కుర్రాకారు గుండెల్లో గూడు కట్టేసుకున్నారు అనన్య. అడపాదడపా సినిమాల్లో కనిపించినా.. సోషల్ మీడియాలోనే ఎక్కువగా వైరల్ అయ్యారు. తాజాగా ఈ అమ్మడు నటిస్తున్న మూవీ అన్వేషి(Anweshi). ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అనన్య. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సినీ ఇండస్ట్రీ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 

ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్.. సోషల్ మీడియాలో మీరు గ్లామర్ ఫొటోస్ పెట్టడానికి రీసన్ ఏంటి? అవకాశాల కోసమే ఆలా చేస్తున్నారా అని డైరెక్ట్ గా అడిగారు. దానికి సమాధానంగా అనన్య మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ వకీల్‌సాబ్‌ ముందు వరకు ఎక్కువగా  ట్రెడిషనల్‌ లుక్‌ ఫొటోలు మాత్రమే షేర్ చేసేదాన్ని. ఆ తరువాత శాకుంతలం సినిమా చేసేటప్పుడు గ్లామరస్ ఫోటోలను షేర్ చేశాను. వాటిని నెటిజన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కూడా అన్ని రకాలుగా కనిపించాలి కదా.. అందుకని గ్లామరస్ ఫోటోలను కూడా షేర్ చేస్తున్నాను..అని చెప్పుకొచ్చారు అనన్య. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.