వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామిని ప్రముఖ యాంకర్సుమ బుధవారం దర్శించుకున్నారు. స్వామివారికి అమె కోడె మొక్కులు చెల్లించారు. దర్శనంతరం ఆమెకు ఆలయ అధికారులు స్వామి కండువా, ప్రసాదం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలిసారి వేములవాడకు వచ్చానని, స్వామి వారిని దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆలయ సూపరిండెంట్లు శ్రీనివాస్‌శర్మ, రాజేందర్, అర్చకులు పూరణం వంశీ తదితరులు పాల్గొన్నారు.
