అప్పులెందుకు  చేశారు.. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్

అప్పులెందుకు  చేశారు.. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఆర్థిక అవకతవకలపై సీఎం సహా ఎవరితోనైనా చర్చకు సిద్ధమని యనమల ప్రకటించారు. వ్యక్తిగత అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నారని, రోడ్ల గుంతలు కూడా ఎందుకు పూడ్చలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ‘కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్లు, నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.  ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోంది? తక్షణమే శ్వేతపత్రం విడుదల చే సి నిధుల దారి మళ్లింపుపై ప్రజల్లో వస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలి’’ అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. 

సిట్‌కు భయపడతామా?

అమరావతి రాజధాని భూములపై సిట్ వేస్తే ఏం జరుగుతుందని ఆయన నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేస్తామని తెలిపారు. అడ్డదారిలో సంపాదించిన దాన్ని ప్రజలకు పంపిణీ చేస్తామని యనమల రామకృష్ణుడు అన్నారు. అడ్డగోలుగా ఫైళ్లు నడిపితే బుక్కయ్యేది మంత్రులు, అధికారులేనని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.