తిరుమల: 8వ తేదీ వరకు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి సర్వదర్శనం

తిరుమల: 8వ తేదీ వరకు సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి సర్వదర్శనం

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు టీటీడీ అదనపు సీహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలోని క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‎లను శుక్రవారం (జనవరి 2) ఉదయం అదనపు ఈవో అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు పూర్తిగా సర్వదర్శనానికి కేటాయించినట్లు తెలిపారు.

జనవరి 1వ తేదీ సాయంత్రం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారని, జనవరి 1వ తేదీ రాత్రి నుండి  సర్వదర్శనం భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించినట్లు చెప్పారు. శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసిందని తెలియజేశారు.టీటీడీలోని అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో భక్తులకు సేవలందిస్తున్నారన్నారు. క్యూ లైన్‎లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అందిస్తున్నట్లు తెలిపారు. 

Also Read : తిరుమలలో భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 30 గంటలు..

భక్తులకు ఎప్పటికప్పుడు దర్శన సమయం, భక్తులు క్యూ క్యూలైన్లలోనికి నిర్దేశించిన ప్రవేశ మార్గాలను, పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా తెలియజేయస్తున్నట్లు చెప్పారు. అప్పటివరకు భక్తులు, యాత్రికల వసతి సముదాయాలలో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. అధిక రద్దీ దృష్ట్యా భక్తులు అధికారుల సూచనలను గమనిస్తూ స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాన్ని సంయమనం పాటిస్తూ చేసుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.