వంట గ్యాస్ పై 10 శాతం వ్యాట్ ను పెంచిన ఏపీ ప్రభుత్వం

వంట గ్యాస్ పై 10 శాతం వ్యాట్ ను పెంచిన ఏపీ ప్రభుత్వం

కరోనా సమయంలో పడిపోయిన ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇళ్లలో వినియోగించే వంట గ్యాస్ వ్యాట్  14.5 శాతంగా ఉన్న గ్యాస్ ధరను 10 శాతం వరకు పెంచింది. దీంతో వ్యాట్ 24.5 శాతానికి పెరిగింది. దీంతో ఒక్కో గ్యాస్ సిలిండర్ పై అదనంగా 65 రూపాయిలు చెల్లించాల్సి  ఉంటుంది. ఈ మేరకు రెవెన్యూ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమ పథకాల నిధుల కోసం వంట గ్యాస్ పై వ్యాట్ పెంచుతున్నట్టు ఏపీ సర్కారు చెప్పింది.  ఏప్రిల్ నెలకు రూ. 4,480 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ. 1,323 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని తెలిపింది. ప్రభుత్వానికి నిధులు పెద్ద మొత్తంలో  కావాల్సి రావడంతో వ్యాట్ పెంచాల్సి వచ్చిందని ప్రకటించింది. ఇప్పటికే పెట్రోల్ పై 31 శాతంతో పాటు అదనంగా మరో నాలుగు రూపాయలు.. డీజిల్ పై 22.5 శాతంతో పాటు అదనంగా నాలుగు రూపాయలు, ఎర్ టర్బైన్ ఇంధనంపై ఒక శాతం వరకు, ముడి చమురుపై 5 శాతం వరకు వ్యాట్ వసూలు చేస్తోంది.