మరో దండయాత్రకు సిద్ధమవుతున్న అమెరికా.. నెక్స్ట్ టార్గెట్ ఆ దేశమే అంటున్న ట్రంప్ !

మరో దండయాత్రకు సిద్ధమవుతున్న అమెరికా.. నెక్స్ట్ టార్గెట్ ఆ దేశమే అంటున్న ట్రంప్ !

కూల్చడం.. పేల్చడమే తమ పని అన్నట్లుంది అమెరికా వ్యవహారం. మొన్న వెనుజులా ప్రభుత్వాన్ని కూల్చిన ట్రంప్ ప్రభుత్వం, ఇవాళ ఇరాన్ ను దాదాపు పడగొట్టింది... రేపు క్యూబా పని పడదాం అన్నట్లు.. తన నెక్స్ట్ టార్గెట్ ఏంటో చెప్పారు ట్రంప్. అమెరికన్ ఫారెన్ పాలసీలో భాగంగా క్యూబాలో మార్పులు చేయాల్సింది ఉంది అంటూ హింట్ ఇచ్చాడు ప్రసిడెంట్ ట్రంప్.

అమెరికా విధానం ముందు నుంచి కూల్చడం.. పేల్చడం అన్నట్లుగానే సాగుతోంది. తన మాట వినని దేశాన్ని టార్గెట్ చేసి.. ఇరుగు పొరుగు దేశాలతో దాడులు చేయించి.. ప్రపంచం ముందు దోషిగా చూపిస్తూ.. చివరికి ప్రభుత్వాలను కూల్చడం అమెరికా విధానంగా మారింది. అందులో భాగంగానే ఇటీవలే వెనుజులాపై దాడి చేసి అధ్యక్షుడు మదురోను బంధీగా పట్టుకుంది ట్రంప్ ప్రభుత్వం. అంతేకాకుండా అక్కడ తమకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తిని నియమించింది. 

లేటెస్లుగా ఇజ్రాయెల్ భుజంపైన తుపాకీ పెట్టి ఇరాన్ పై దాడికి దిగిన అమెరికా.. చివరికి ఇజ్రెయెల్ ను వెనక్కి నెట్టి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అన్నట్లుగా ఇరాన్ పై విరుచుకుపడుతోంది. సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేసిన యూఎస్.. కొత్త సుప్రీం ఎవరనేది తమ ప్రమేయంతోనే జరగాలని చాటిచెబుతోంది. ఇరాన్ తో యుద్ధం దాదాపు ముగింపు దశకు చేరుకుందని ట్రంప్ భావిస్తున్నారేమో.. ఇక తమ తదుపరి ఫోకస్ క్యూబా పైనే అని చెబుతున్నాడు. 

వైట్ హౌస్ లో ఇంటర్ మియామీ యజమానులతో మాట్లాడుతూ మాట్లాడుతూ.. హవానాతో చర్చలు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పాడు. అదే విధంగా అమెరికన్- క్యూబా స్టేక్ హోల్డర్స్ త్వరలోనే వారి దేశం క్యూబాకు తిరిగి వెళ్లవచ్చునని అన్నారు. 

ఇరాన్ యుద్ధం కొలిక్కి వచ్చాక..

ఇరాన్ వ్యవహారం ముగిసిన తర్వాత అమెరికా క్యూబాపైన దృష్టి సారిస్తుందని ట్రంప్ అన్నారు. ముందు ఇరాన్ విషయం పూర్తి చేయాలి.. అది త్వరలోనే పూర్తవుతుంది. ఆ తర్వాత క్యూబాలో మార్పు మొదలవుతుందని అన్నారు ట్రంప్. 

►ALSO READ | పెట్రోల్ కొరతలో.. వర్క్ ఫ్రం హోం ఇచ్చిన దేశం.. ముందస్తు జాగ్రత్త

క్యూబా అధికారవర్గం అమెరికాతో ఒప్పందాలు చేసుకునేందుకు ఉత్సాహంతో ఉన్నారని అన్నారు ట్రంప్. ముందు చర్చలు జరపే అవకాశం ఉంటుంది. కానీ ఈ విషయంలో చాలా భౌగోళిక రాజకీయ సవాళ్లు ఉంటాయని అన్నారు. ఒప్పందాల విషయంలో తమతో కలిసి రాకపోతే క్యూబా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది.. అంటూ హెచ్చరించారు. 

ఆర్థిక, ఇంధన సంక్షోభంలో క్యూబా:

క్యూబా ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక, ఇంధన సంక్షోభంలో ఉంది.  ఇంధన సరఫరాకు ఆటంకాలు, ఎలక్ట్రిక్  గ్రిడ్ ల క్షీణతతో తీవ్ర విద్యుత్, ఇంధన కొరతతో సతమతమవుతోంది. హవానా సిటీలో పరిస్థితి మరింత దారుణంగా తయారైనట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. క్యూబా సంక్షోభంలో ఉంది . వాళ్లకు డబ్బు కావాలి.. మేము సహాయం చేయడానికి సిద్దంగా ఉన్నాం.. వాళ్లతో మాట్లాడుతన్నాం.. అంటూ ఇంతకు ముందు ఇంటర్వ్యూలలో చెప్పారు ట్రంప్. 

అంతకుముందు కూడా క్యూబా లక్ష్యంగా డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశానికి చమురు విక్రయించే ఏ దేశంపైనైనా టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం కూడా చేశారు. క్యూబా విషయంలో జాతీయ అత్యవసర పరిస్థితి కింద ట్రంప్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ దేశ ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో స్నేహపూర్వక రీతిలోనే క్యూబాను తమ ఆధీనంలోకి తీసుకోవాల్సి రావచ్చు అంటూ కామెంట్ చేశారు.