రోజు రోజుకూ ఇరాన్ తన దాడులను తీవ్రతరం చేస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా డజనుకు పైగా దేశాలు ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఇబ్బంది పడుతున్నాయి. ప్రధానంగా మధ్యప్రాశ్చంలోని ముస్లిం దేశాలు తాజా దాడులతో గజగజలాడుతున్నాయి. మెుదట్లో లైట్ తీసుకున్న సదరు దేశాలు.. ఇరాన్ అటాక్స్ పెంచటం, దాడులను తీవ్రతరం చేయటంతో డిఫెన్స్ మోడ్ లోకి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నాయి. ఈ క్రమంలోని తమ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
ఇరాన్ దాడులను తీవ్రతరం చేసిన వేళ.. గ్లోబల్ హబ్ అయిన దుబాయ్‌లో ఒక్కసారిగా హై అలర్ట్ ప్రకటించారు. శుక్రవారం ఉదయం దుబాయ్ నివాసితుల మొబైల్ ఫోన్లకు వరుసగా "క్షిపణి దాడులు" జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గత వారం రోజులుగా ఇరాన్, అమెరికా స్థావరాలపై దాడులను ఇరాన్ కొనసాగిస్తుండటంతో ఈ అలర్ట్స్ రావడం కలకలం రేపింది.
దుబాయ్‌లో నివసిస్తున్న ప్రజలకు అక్కడి ప్రభుత్వం వరుసగా 4 అలర్ట్స్ పంపింది. ప్రజలు ఎవరూ బయట తిరగవద్దని, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అధికారులు అందులో సూచించారు. ఈ పరిస్థితుల్లో తాము పాస్‌పోర్టులు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లతో ఒక బ్యాగ్‌ను సిద్ధం చేసుకున్నామని.. నిత్యావసరాలను కూడా స్టాక్ చేసుకున్నట్లు అక్కడి వ్యక్తి ఒకరు వెల్లడించారు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో అయతొల్లా అలీ ఖమేనీ మరణించారనే వార్తల తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులే ప్రస్తుత పరిస్థితులకు కారణంగా తేలింది.
ALSO READ : మరో దండయాత్రకు సిద్ధమవుతున్న అమెరికా..
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ విమానాశ్రయంపై ఈ యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది. గగనతలం మూసివేయడంతో వేలాది మంది భారతీయులు యూఏఈలో చిక్కుకుపోయారు. అయితే దుబాయ్ అధికారులు పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించి.. సోమవారం నుంచి చాలా మందిని సురక్షితంగా భారత్‌కు పంపగలిగారు.
మరోవైపు.. ఇరాన్‌పై దాడుల్లో తాము అమెరికా, ఇజ్రాయెల్‌తో చేరుతున్నామనే వార్తలను యూఏఈ ప్రభుత్వం ఖండించింది. తమ రక్షణ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ దుబాయ్‌లోని.. అమెరికా కాన్సులేట్, అబుదాబిలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడులు చేయడంతో పరిస్థితులు హీటెక్కాయి.
