కోల్‌కతా: వెస్టిండీస్ డ్యాషింగ్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఐపీఎల్ ఆటగాడిగా తన ప్రయాణానికి ముగింపు పలికాడు. ఈ నెల16న జరగనున్న మినీ వేలానికి ముందు ఆదివారం ఈ నిర్ణయాన్ని ప్రకటించిన 37 ఏండ్ల రస్సెల్ కోల్‌కతా నైట్ రైడర్స్ కోచింగ్ సిబ్బందిలో చేరనున్నట్లు తెలిపాడు.
2014 నుంచి కేకేఆర్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రస్సెల్ రాబోయే సీజన్ నుంచి పవర్ కోచ్‌గా కొత్త పాత్రలో పని చేయనున్నట్టు వెల్లడించాడు. ఐపీఎల్‌లో 140 మ్యాచులు ఆడిన రస్సెల్ 174.18 స్ట్రైక్ రేట్‌తో 2,651 రన్స్ చేసి, 123 వికెట్లు పడగొట్టాడు.
