
అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తారామణి’. రామ్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జె.ఎస్. కె. ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో డి.వి.సినీ క్రియేషన్స్, లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ బ్యానర్ పై ఉదయ్ హర్షవ డ్డేల్ల, డి.వి.వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలూ పూర్తయ్యాయి. సెప్టెంబరు 6న విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయమై నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇదొక ట్రయాంగ్యులర్ లవ్‌స్టోరీ. ఎమోషనల్ కంటెంట్‌తో పాటు అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రతి సీన్ మనసుకి హత్తుకుంటుంది.
నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో సినిమా సాగుతుంది. యువత టెక్నాలజీ మాయలో పడి ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలాంటి ప్రలోభాలకు లోనవుతున్నారు, ఫలితంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారనే అంశాలు ఉంటాయి. యూత్ మెచ్చే అన్ని అంశాలూ ఉన్నాయి. ట్రైలర్ ను కమల్ హాసన్, పాటలను సూపర్ స్టార్ రజనీకాంత్ విడుదల చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకి కూడా అలాగే వస్తుందని ఆశిస్తున్నాం ’ అని తెలిపారు.