అంగన్వాడీలకు బీఎల్ఓ డ్యూటీలు రద్దు చేయాలి : తెలంగాణ అంగన్వాడీ టీచర్స్

అంగన్వాడీలకు బీఎల్ఓ డ్యూటీలు రద్దు చేయాలి : తెలంగాణ అంగన్వాడీ టీచర్స్

హైదరాబాద్, వెలుగు: అంగన్​వాడీలకు ఇస్తున్న బీఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని తెలంగాణ అంగన్​వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ కేంద్రాలను రద్దు చేసి వాటి బాధ్యతలను అంగన్​వాడీ కేంద్రాలకే ఇవ్వాలని కోరింది. శుక్రవారం హైదరాబాద్ ప్రజాభవన్‌‌ ప్రజావాణిలో నోడల్ అధికారి విద్యాసాగర్, ఇన్​చార్జి చిన్నారెడ్డిలకు నేతలు వినతిపత్రం ఇచ్చారు. 

కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలన్నారు.  యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, ప్రధాన కార్యదర్శి  జయలక్ష్మి నేతృత్వంలో జరిగిన చర్చల అనంతరం అధికారులు స్పందిస్తూ, అంగన్​వాడీ సమస్యలపై చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ డైరెక్టర్ శృతి ఓజాకు లేఖ రాసినట్లు తెలిపారు.