ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో ఉన్న భరత్ స్కూల్ లో పర్మిషన్ లేకుండా ఉర్దూ బోధించిన ప్రిన్సిపాల్అమీర్ఖాన్తోపాటు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్మూర్ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డితోపాటు సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాను వేర్వేరుగా కలిసి మెమోరాండం అందజేశారు.
బీజేపీ జిల్లా కార్యదర్శి పోల్కం వేణు మాట్లాడుతూ.. స్కూల్లో నమాజ్చదివించడం, నేర్పించడం చేసిన ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేయాలని, ఉర్ధూ పాఠాలు బోధిస్తున్న చర్య తీసుకోకుండా నిర్లక్ష్యం చేసిన ఎంఈవో పింజ రాజగంగారాంపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.జెఅనిల్, పి.యుగంధర్, కె.ప్రశాంత్, ఉదయ్‌గౌడ్, ద్యాగ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
