- వైభవ్ సూర్యవంశీకి నో చాన్స్!
- రా. 7 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో లైవ్
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌కు ఇండియా రెడీ అయ్యింది. శనివారం జరిగే ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. వరుస వైఫల్యాలతో ఇబ్బందిపడుతున్న వికెట్ కీపర్ సంజూ శాంసన్, తిలక్ వర్మపై ప్రత్యేక దృష్టి నెలకొంది. వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ నుంచి శాంసన్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. తొలి మ్యాచ్‌లో ఒక్క రన్ మాత్రమే చేసిన శాంసన్.. పేస్ బౌలింగ్ పిచ్‌లపై దీటుగా ఆడలేకపోతున్నాడు.
ఇటు అభిషేక్ శర్మ గత మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. దాంతో ఈ మ్యాచ్‌లో శాంసన్ గాడిలో పడకపోతే ప్లేస్ గల్లంతు కావడం ఖాయమే. మిడిలార్డర్‌లో తిలక్ వర్మ స్లో బ్యాటింగ్ మేనేజ్‌మెంట్‌ను ఆందోళనలో పడేసింది. స్పిన్నర్లు, స్లో బౌలర్ల బౌలింగ్‌లో తిలక్ రన్స్ రాబట్టడానికి చాలా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం.
అయితే ఇషాన్ కిషన్ కూడా మెరవాల్సి ఉంది. బౌలింగ్‌లో ఎలాంటి మార్పులు చేయడం లేదు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ స్పిన్ బాధ్యతలను మోయనున్నారు. పేసర్లుగా హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌ను కొనసాగించనున్నారు. మరోవైపు ఇంగ్లండ్ కూడా ఈ మ్యాచ్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్, ఫిల్ సాల్ట్, టామ్ బాంటన్, బట్లర్, జాకబ్ బీథెల్‌తో కూడిన పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌ను నిలువరించాలంటే ఇండియా బౌలర్లు శక్తికి మించి శ్రమించాలి.
బౌలింగ్‌లో సకీబ్ మహ్మద్ కీలకం కానున్నాడు. ల్యూక్ వుడ్, ఆదిల్ రషీద్, సామ్ కరన్ చెలరేగితే ఇండియాకు కష్టాలు తప్పవు. ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే చాన్స్ ఉండటంతో ఇరుజట్లు ఈ అంశంపై దృష్టి సారించాయి.
