హైదరాబాద్, వెలుగు: టీజీ 20 లీగ్‌లో అనురాగ్ నల్గొండ నైట్స్ నాలుగో విజయాన్ని అందుకుంది. ఛేజింగ్‌లో గౌరవ్ రెడ్డి (101 నాటౌట్) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో నల్గొండ 8 వికెట్ల తేడాతో మెదక్ ఫాల్కన్స్‌పై గెలిచింది. ముందుగా మెదక్ 20 ఓవర్లలో 180/4 స్కోరు చేసింది.
విక్రమ్ నాయక్ (48 నాటౌట్), వరుణ్ యర్రం (44 నాటౌట్), రవితేజ (33), శ్రుంజిత్ రెడ్డి (30) రాణించారు. తర్వాత నల్గొండ 16.3 ఓవర్లలో 181/2 స్కోరు చేసింది. జశ్వత్ మోతే (34), నితీశ్ రెడ్డి (21), రాహుల్ బుద్ధి (20 నాటౌట్) మెరుగ్గా ఆడారు. గౌరవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
