జులై12న కేజీబీవీ ఎంట్రన్స్ టెస్ట్.. వికారాబాద్ జిల్లాలోని మూడు పాఠశాలల్లో అడ్మిషన్లు

జులై12న కేజీబీవీ ఎంట్రన్స్ టెస్ట్.. వికారాబాద్ జిల్లాలోని మూడు పాఠశాలల్లో అడ్మిషన్లు

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలోని 3 కేజీబీవీ( వికారాబాద్, దోమ, కొడంగల్)ల్లో ఈ నెల 12న ఆరోతరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఈవో అబ్దుల్ ఘనీ ఒక ప్రకటనలో తెలిపారు. టెస్ట్​ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఆరోతరగతి నుంచే జాతీయ స్థాయిలో జేఈఈ, నీట్, క్లాట్ వంటి పోటీ పరీక్షలకు అనుగుణంగా బోధన చేస్తామని పేర్కొన్నారు. హాస్టల్ వసతి, నాణ్యమైన బోధన, ఎస్ వోపీ ద్వారా రుచికరమైన భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్​బుక్స్, యూనిఫాంలు, దుప్పట్లు తదితర వస్తువులు అందిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు సంబంధిత కేజీబీవీ కేంద్రాల్లో స్పెషల్​ఆఫీసర్లను సంప్రదించాలని సూచించారు.