జాగ్రెబ్ (క్రొయేషియా): వరల్డ్ చాంపియన్, ఇండియా గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్... గ్రాండ్ చెస్ టూర్‌లో గాడిలో పడ్డాడు. శుక్రవారం జరిగిన ర్యాపిడ్ మూడు గేమ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమిని నమోదు చేశాడు. అనీష్ గిరితో జరిగిన గేమ్‌లో రుయ్ లోపెజ్ వ్యూహంతో ఆడిన గుకేశ్ విజయం సాధించాడు.
అంతకుముందు రొమేనియా ప్లేయర్ బొగ్దాన్ డేనియల్‌తో జరిగిన గేమ్‌లో ఓడినా.. తర్వాత జోర్డెన్ వాన్ ఫోరెస్ట్‌పై నెగ్గి పుంజుకున్నాడు. ప్రస్తుతం ఆరు రౌండ్లు ముగిసేసరికి గుకేశ్ 7 పాయింట్లతో సంయుక్తంగా రెండో ప్లేస్‌లో ఉన్నాడు. ఫోరెస్ట్‌పై గెలిచిన ఆర్. ప్రజ్ఞానంద.. నోడిర్బెక్ అబ్దుసత్తారోవ్, అలీరెజా ఫిరౌజాతో జరిగిన గేముల్లో ఓటమిపాలయ్యాడు. ప్రజ్ఞానంద ఆరు పాయింట్లతో కొనసాగుతున్నాడు.
