జొకోవిచ్‌ @ 105

జొకోవిచ్‌ @ 105

లండన్‌: సెర్బియా లెజెండ్‌ నొవాక్‌ జొకోవిచ్‌.. వింబుల్డన్‌లో దుమ్మురేపుతున్నాడు. శుక్రవారం జరిగిన మెన్స్‌ సింగిల్స్‌ మూడో రౌండ్‌లో జొకో 7–5, 6–4, 1–6, 7–6 (7/4)తో ఆర్థర్‌ రిండర్‌కెంచ్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. వింబుల్డన్‌లో జొకోకు105వ విజయం ఇది. దాంతో టోర్నీలో అత్యధిక విజయాలు సాధించిన రోజర్‌ ఫెడరర్‌తో సమంగా నిలిచాడు. 

ఇతర మ్యాచ్‌ల్లో యానిక్‌ సినర్‌ (ఇటలీ) 6–4, 6–3, 6–4తో బ్రూక్స్‌బే (అమెరికా)పై గెలవగా, డానియెల్‌ మెద్వెదెవ్‌ (రష్యా) 6–7 (4/7), 6–7 (5/7), 5–7తో స్ట్రఫ్‌ (జర్మనీ) చేతిలో కంగుతిన్నాడు. రష్యా క్వాలిఫయర్‌ రోమన్‌ సఫియుల్లిన్‌ 6–3, 6–3, 6–3తో 24వ సీడ్‌ జోవా ఫోన్సెకా (బ్రెజిల్‌)పై సంచలన విజయం సాధించాడు.  

విమెన్స్‌ సింగిల్స్‌ మూడో రౌండ్‌లో పెగులా (అమెరికా) 6–1, 6–3తో బౌజాస్‌ మనెరో (స్పెయిన్‌)పై, బెలిండా బెనిసిచ్‌ (స్విట్జర్లాండ్‌) 6–4, 4–6, 7–6 (10/7)తో కలిన్‌స్కాయ (రష్యా)పై, ఇవా జోవిచ్‌ (అమెరికా) 6–3, 3–6, 6–4తో ఎకటెరినా అలెగ్జాండ్రోవా (రష్యా)పై, నవోమి ఒసాకా (జపాన్‌) 6–1, 6–3తో కటాస్కినా (ఆస్ట్రేలియా)పై గెలిచి ముందంజ వేశారు.