నేవీ యూత్ స్పోర్ట్స్ స్కూల్‌‌‌‌కు బీసీ గురుకుల విద్యార్థుల ఎంపిక

నేవీ యూత్ స్పోర్ట్స్ స్కూల్‌‌‌‌కు బీసీ గురుకుల విద్యార్థుల ఎంపిక
  •     శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్, వెలుగు:  గోవాలోని నేవీ యూత్ స్పోర్ట్స్ కంపెనీ క్రీడా స్కూల్​ప్రవేశ పరీక్షలో నలుగురు బీసీ గురుకుల విద్యార్థులు ఎంపికయ్యారని బీసీ గురుకులాల సెక్రటరీ బడుగు సైదులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగంలో ఇస్తున్న ప్రోత్సాహంతో విద్యార్థులు ఈ పోటీ పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ వరకు ఉచిత విద్య, వసతి, అలాగే ప్రత్యేక క్రీడా శిక్షణ అందుతుందని తెలిపారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగ అవకాశం కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైన వారిలో ధనుష్, శివరాజ్, కౌనిక్ వర్ధన్, అరవింద్ (నిజామాబాద్ జిల్లా ధర్మారం) ఉన్నారు. ఎంపికైన విద్యార్థులకు బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రిన్సిపల్ సెక్రటరీ బి. మాయదేవి శుభాకాంక్షలు తెలిపారు.