మోదీ విదేశీ పర్యటన.. జులై 6 నుంచి మూడు దేశాల టూర్

మోదీ విదేశీ పర్యటన.. జులై 6 నుంచి మూడు దేశాల టూర్

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ జులై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ఉద్దేశమని విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది.

 ప్రధాని తొలుత ఇండోనేషియా,  ఆస్ట్రేలియాల్లో పర్యటిస్తారు. తర్వాత న్యూజిలాండ్‌‌కు వెళ్తారు.  దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని న్యూజిలాండ్‌‌ను  సందర్శించనున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ తెలిపారు.