మరీ చీప్గా సోం పాపిడీ నా.. కంపెనీ ఇచ్చిన దివాళి గిఫ్ట్ను విసిరి కొట్టిన ఉద్యోగులు.. వీడియో వైరల్

మరీ చీప్గా సోం పాపిడీ నా.. కంపెనీ ఇచ్చిన దివాళి గిఫ్ట్ను విసిరి కొట్టిన ఉద్యోగులు.. వీడియో వైరల్

ఒక కంపెనీ నిలబడాలంటే అందులో పనిచేసే ఉద్యోగులే దానికి పిల్లర్లు. వాళ్ల శ్రమ, మేధస్సుపైన ఆధారపడే లాభాలు, ఆదాయం. ఏళ్లతరబడి తమ కంపెనీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న ఎంప్లాయిస్ కోసం పండుగల వేళ బోనస్ లు.. లేదా గిఫ్ట్ ప్యాక్ లు ఇస్తుంటాయి మేనేజ్మెంట్లు. ఇలా చేయడం వలన ఉద్యోగులపై యాజమాన్యానికి ఉన్న  కన్సర్న్.. బాధ్యత తెలుస్తుంటుందని నమ్ముతుంటారు. 

ఉద్యోగులు కూడా కంపెనీని ఓన్ చేసుకునేలా.. మన కంపెనీ అనేలా బాధ్యతగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తుంటారు. కానీ కొన్ని కంపెనీలు అలాంటివేవీ చేయకుండా ఉద్యోగుల ఆగ్రహానికి గురవుతుంటే..  మరికొన్ని కంటితుడుపు చర్యగా వ్యవహరిస్తుంటాయి. అలాంటి కంపెనీకి చెందిన స్టోరీనే ఇది. ఉద్యోగులు చేసిన పనికి అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

హర్యానాలోని సోనిపేట్ లో ఉన్న ఒక ఫ్యాక్టరీ దీపావళి సందర్భంగా ఎంప్లాయిస్ కు గిఫ్ట్ గా స్వీట్ బాక్స్ ఇచ్చింది. పండగ కానుకగా సోంపాపిడి ఇవ్వడం ఉద్యోగుల ఆగ్రహానికి దారి తీసింది. ఫ్యాక్టరీ ఇచ్చిన సోంపాపిడీ బాక్సులను నిరసనగా అందరూ గేటు ముందు పడేయటం పెద్ద చర్చకు దారితీసింది. 

ఉద్యోగుల నిరసనకు కారణం.. దివాళికి బోనస్ ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చిందట. చివరికి బోనస్ ఇవ్వకపోగా.. చీప్ గా సోంపాపిడీ ఇవ్వడమేంటని ఆగ్రహంతో గేటు ముందు పడేసి నిరసన వ్యక్తం చేశారు ఆ ఫ్యాక్టరీ ఉద్యోగులు. 

సోషల్ మీడియాలో ట్రోలింగ్స్:

సోం పాపిడీ గేటు ముందు పడేసి నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో డిబేట్ కు దారితీసింది. కంపెనీ డెవలప్ మెంట్ కోసం పనిచేస్తున్న ఎంప్లాయిస్ కు చీప్ గా సోంపాపిడీ ఇవ్వడమేంటని కిందరు ట్రోల్ చేస్తు్న్నారు. 

అయితే బోనస్ అనేది కంపెనీ చాయిస్ అని.. ఇవ్వాలనుకుంటే ఇస్తుంది లేదంటే లేదు.. ఇలా ఫ్యాక్టరీ పరువు తీయడమేంటని ఒక కంపెనీ ఓనర్ పోస్ట్ చేశాడు. దీనిపై కూడా నెటిజన్లు విమర్శలకు దిగారు. బోనస్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ.. అంత చీప్ గా సోంపాపిడీ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు.