IND vs ENG: గిల్, అయ్యర్ వద్దు.. కోహ్లీ స్థానంలో అతడిని ఆడించండి: అనీల్ కుంబ్లే

IND vs ENG: గిల్, అయ్యర్ వద్దు.. కోహ్లీ స్థానంలో అతడిని ఆడించండి: అనీల్ కుంబ్లే

విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే విషయం ఆసక్తిగా మారింది. కోహ్లీ టెస్టుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత దశాబ్ధాకాలంగా కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు కోహ్లీ లేకపోవడంతో అతని స్థానంలో గిల్, శ్రేయాస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టీమిండియా దిగ్గజ స్పిన్నర్ మాత్రమే నాలుగో స్థానంలో కరుణ్ నాయర్ ను ఆడించాలని సలహా ఇవ్వడం వైరల్ గా మారుతుంది. 

కరుణ్ నాయర్ ఇప్పటికే టెస్ట్ జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్ తో జరగబోయే అనధికారిక మ్యాచ్ లో రాణిస్తే టెస్ట్ జట్టులో స్థానం దక్కవచ్చు. చివరి టెస్ట్ మార్చి 2017లో ధర్మశాలలో ఆస్ట్రేలియాతో ఆడాడు. 2018 ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా స్క్వాడ్ లో ఎంపికైనా ఒక్క టెస్ట్ మ్యాచ్  లో కూడాఆడే అవకాశం రాలేదు. టెస్ట్ సిరీస్ లో అతడు ముందు స్క్వాడ్ లో ఎంపిక అవుతాడో లేదో తెలియదు. ఒకవేళ ఎంపికైన ప్లేయింగ్ 11 లో అతనికి చోటు దక్కడం కష్టం. ఈ నేపథ్యంలో నాయర్ ను ఏకంగా కోహ్లీ స్థానంలో బ్యాటింగ్ చేయమని కుంబ్లే షాక్ ఇచ్చాడు. 

కుంబ్లే మాట్లాడుతూ.. “కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించాడు కాబట్టి భారత జట్టులోకి తిరిగి రావడానికి అర్హుడు. అతను ఇంగ్లాండ్ పై జరగబోయే సిరీస్ లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ ఆడవచ్చు. నాలుగు నెంబర్ లో ఆడాలంటే కొంచెం అనుభవం కావాలి. కరుణ్ కు ఇంగ్లాండ్‌లో ఆడాడు కాబట్టి అక్కడి పరిస్థితులు తెలుసు. కరుణ్ 30 సంవత్సరాలు ఉన్నప్పటికీ అతను ఇంకా చిన్నవాడు. దేశీయ క్రికెట్‌లో అతని అద్భుతమైన ప్రదర్శనకు గుర్తింపు దక్కాలని కోరుకుంటున్నాను". అని కుంబ్లే అన్నారు. 

33 ఏళ్ల కరుణ్ నాయర్ 2017 నుండి టీమిండియా తరపున ఆడలేదు. 2016 లో ఇంగ్లాండ్ పై ట్రిపుల్ సెంచరీ చేసిన ఈ కర్ణాటక బ్యాటర్ ఆ తర్వాత పేలవ ఫామ్ తో జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఇటీవలే దేశవాళీ క్రికెట్ లో నాయర్ దుమ్ము రేపాడు. వరుస సెంచరీలతో హోరెత్తించాడు. దీంతో 8 ఏళ్ళ తర్వాత ఈ వెటరన్ ప్లేయర్ ను సెలక్ట్ చేయనున్నారు. వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం కరుణ్ నాయర్ ఎంపిక చేసినట్టు సమాచారం.