సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసిన అనిల్ కూర్మాచలం

సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసిన అనిల్ కూర్మాచలం

రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఇవాళ టీఆర్ఎస్ ఎన్నారై అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన ఇటీవలే నూతనంగా తెలంగాణ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైయ్యారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ కూర్మాచలం మంత్రి తలసానిని కలిశారు. ఈ సందర్భంగా అనిల్ కు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం అనిల్ కూర్మాచలం మంత్రితో కాసేపు ముచ్చటించారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని మంత్రి ఆకాంక్షించారు.