యానిమల్ OTT డీటెయిల్స్.. ఆ విషయంలో ఆడియన్స్కు నిరాశే!

యానిమల్ OTT డీటెయిల్స్.. ఆ విషయంలో ఆడియన్స్కు నిరాశే!

ఆడియన్స్ లో యానిమల్(Animal) మూవీ ఫీవర్ ఇంకా తగ్గలేదు. విడుదలై 20 రోజులు కావస్తున్నా సూపర్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ మూవీ. కొత్త రిలీజైన సినిమాలను సైతం పక్కకు నెట్టేసి అదిరిపోయే రెస్పాన్స్ రాబడుతోంది యానిమల్ మూవీ. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా వచ్చిన ఈ మూవీ ఇప్పటికే రూ.830 కోట్లు కొల్లగొట్టి సరికొత్త రిక్కార్డ్స్ క్రియేట్ చేసింది. త్వరలో వెయ్యి కోట్ల మార్కును దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఆడియన్స్ యానిమల్ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి సంబందించిన ఒక న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. యానిమల్ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు యానిమల్ సినిమాను సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇక థియేటర్ లో 3:20 నిమిషాల పాటు అలరించిన ఈ సినిమా ఓటీటీలో 4 గంటల నిడివితో రానుంది. అయితే ఇక్కడ ఆడియన్స్ కు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పనున్నారు నెట్ ఫ్లిక్స్ సంస్థ. ఇటీవలే ఓటీటీ సంస్థలకు కూడా గైడ్ లైన్స్ మార్చారు. కాబట్టి యానిమల్ సినిమాకు ఓటీటీలో సెన్సార్ కట్ పడనుంది. ఈ కారణంగా సినిమాలో ఉన్న బోల్డ్ సీన్స్ కు కత్తెర పడనుందని సమాచారం. ఒకవేళ అలా కట్ పడితే.. 4 గంటలు యానిమల్ సినిమాను చూడటం కష్టమే అని చెప్పాలి.