నాన్న.. నువ్ నా ప్రాణం.. యానిమల్ నుంచి థర్డ్ సాంగ్

నాన్న.. నువ్  నా ప్రాణం.. యానిమల్ నుంచి థర్డ్ సాంగ్

రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా రూపొందించిన హిందీ చిత్రం ‘యానిమల్’.  అనిల్ కపూర్‌‌,‌‌ బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  మంగళవారం ‘నాన్న నువ్ నా ప్రాణం’ అనే మూడో పాటను విడుదల చేశారు.  రణ్‌‌బీర్‌‌, అనిల్ కపూర్ క్యారెక్టర్స్ మధ్య చిత్రీకరించిన ఎమోషనల్ బాండింగ్‌‌తో  మనసుని హత్తుకునేలా పాట సాగింది.  

హర్షవర్ధన్ రామేశ్వర్ కంపోజ్ చేసిన పాటను సింగర్ సోనూ నిగమ్ మెస్మరైజింగ్‌‌గా పాడాడు.  ‘ఏ కానుకలు.. నీ లాలనతో సరితూగవు ఇది నిజమే.. నీ సమయముకై.. ఈ  జీవితమే చూస్తున్నది పసితనమే.. నాన్న నువ్ నా ప్రాణం అనినా... సరిపోదట ఆ మాట..’ అంటూ  త్రండీ కొడుకుల బంధాన్ని తెలియజేసేలా అనంతశ్రీరామ్ రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.  

టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్‌‌పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 1న హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.