కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ ఈవోగా అంజనారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఈవోగా పనిచేసిన శ్రీకాంత్‌రావు లీవ్‌లో వెళ్లడంతో వేములవాడ ఈవో రమాదేవి ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం శ్రీకాంత్‌రావును కొమురవెళ్లికి ట్రాన్స్‌ఫర్ చేశారు. కొండగట్టుకు అంజనారెడ్డిని పూర్థిస్థాయి ఈవోగా బాధ్యతలు అప్పగిస్తూ ఎండోమెంట్ కమిషనర్ హన్మంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
