తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా అంజనీ కుమార్

తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా అంజనీ కుమార్

రాష్ట్ర ఇంఛార్జ్ డీజీపీగా1990 బ్యాచ్కు చెందిన అంజనీకుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 31తో ముగియనుండటంతో ఏసీబీ డీజీగా ఉన్న అంజనీ కుమార్కు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ఆయన బదిలీతో ఖాళీ అయిన ఏసీబీ డైరెక్టర్ జనరల్ పదవికి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న 1990 బ్యాచ్కు చెందిన రవి గుప్తాను ఎంపిక చేసింది. దీంతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. రవి గుప్తా ట్రాన్స్ఫర్తో ఖాళీ అయిన స్థానాన్ని అడిషనల్ డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా ఉన్న 1992 బ్యాచ్కు చెందిన డాక్టర్ జితేంద్రను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయన జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. 

రాచకొండ సీపీగా ఉన్న 1995 బ్యాచ్ కు చెందిన మహేశ్ భగవత్ను ప్రభుత్వం సీఐడీ అడిషనల్ డీజీపీగా నియమించింది. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీగా ఉన్న1997 బ్యాచ్కు చెందిన దేవంద్ర సింగ్ చౌహాన్ను రాచకొండ కమిషనర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పీ అండ్ ఎల్ అడిషనల్ డీజీపీగా సేవలందిస్తున్న 1997 బ్యాచ్కు చెందిన సంజయ్ కుమార్ జైన్ను లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు ఆయనతు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.