
జగిత్యాలలో జిల్లాలో ఓ కౌంటింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాలతో పాటు ఓ లేఖ బయటపడింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెకండ్ ఏఎన్ఎంలు.. సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 12 సంవత్సరాలుగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని లేఖలో కోరారు. ప్రసూతి సెలవులతో పాటు క్యాజువల్ లీవ్స్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదే తరహాలో పెద్దపల్లి జిల్లా మంథనిలోనూ బ్యాలెట్ బాక్స్ లో ఓ దివ్యాంగుడు రాసిన లెటర్ బయటపడింది. వెన్నెముక గాయంతో బాధపడ్తున్న దివ్యాంగుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని, ప్రభుత్వం సహాయం చేయాలన్నాడు. తమ కష్టాలు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ను కోరాడు.