అన్న క్యాంటీన్లలో మెనూ ఇదే...

అన్న క్యాంటీన్లలో మెనూ ఇదే...

ఏపీలో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తోంది కూటమి సర్కార్. ఆగస్టు 15న అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు సిద్ధమైంది చంద్రబాబు సర్కారు. ఈ క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.5 కే భోజనం అందించనుంది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 203 అన్న క్యాంటీన్లలో ఇప్పటికే 180 క్యాంటీన్లు సిద్దమైనట్లు సమాచారం.

ముందుగా 100క్యాంటీన్లకు భోజనం సరఫరా మొదలు పెట్టి ఆ తర్వాత ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబర్ 5న మిగిలిన క్యాంటీన్లకు కూడా భోజనం సరఫరా చేయనున్నారు. ఈ మేరకు ఆహార తయారీ, సరఫరాకు సంబంధించిన కాంట్రాక్టును హరే కృష్ణ మూవ్మెంట్స్ సంస్థ దక్కించుకుంది. గురువారం ( ఆగస్టు 15 )నాడు సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు.

అన్న క్యాంటీన్లలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అందుబాటులో ఉండనుంది. ఇందుకు సంబంధించిన మెనూ కూడా విడుదలయ్యింది.

అన్న క్యాంటీన్లలో రోజువారీ మెనూ:

సోమవారం: టిఫిన్ - ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా. లంచ్ / డిన్నర్ - వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి

మంగళవారం: టిఫిన్ - ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా, చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్. లంచ్ / డిన్నర్ - వైట్ రైస్, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి

బుధవారం : టిఫిన్ - ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్. లంచ్  / డిన్నర్ - వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు పచ్చడి.

గురువారం : టిఫిన్ - ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా. లంచ్ / డిన్నర్ - వైట్ రైస్, కూర, పప్పు/సాంబారు, పెరుగు, పచ్చడి.

శుక్రవారం : టిఫిన్ - ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా, చట్నీ/పొడి, సాంబారు, మిక్చర్. డిన్నర్ / లంచ్ - వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి

శనివారం : టిఫిన్ - ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబారు లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబారు, మిక్చర్. లంచ్ / డిన్నర్ - వైట్ రైస్, కూర, పప్పు/సాంబారు, పెరుగు, పచ్చడి.

ఆదివారం: సెలవు