బీజేపీకి అన్నామలై గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బై.. కొత్త పార్టీ పెట్టే యోచనలో మాజీ చీఫ్!

బీజేపీకి అన్నామలై గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బై.. కొత్త పార్టీ పెట్టే యోచనలో మాజీ చీఫ్!

చెన్నై: తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై  ఆ పార్టీకి గుడ్‌‌‌‌‌‌‌‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. బీజేపీలో తగిన గుర్తింపు, భవిష్యత్తు లేదనే అసంతృప్తితో ఉన్న ఆయన త్వరలో కొత్త పార్టీ స్థాపించబోతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో పార్టీ అగ్రనాయకులతో భేటీ అనంతరం ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క సీటుకు పరిమితమైన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో తాజాగా అన్నామలై పార్టీని వీడనున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. కొత్త పార్టీ ఊహాగానాల నేపథ్యంలో అన్నామలైని బుజ్జగించేందుకు బీజేపీ హైకమాండ్ ఆయనకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఢిల్లీ పెద్దల ఆఫర్‌‌‌‌‌‌‌‌ను అన్నామలై సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం.