త్వరలో అన్ని ఎగ్జామ్స్ రీ షెడ్యూల్ 

త్వరలో అన్ని ఎగ్జామ్స్ రీ షెడ్యూల్ 

హయ్యర్​ ఎడ్యుకేషన్​ కౌన్సిల్​ చైర్మన్​ పాపిరెడ్డి వెల్లడి

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో జరుగుతున్న రెగ్యులర్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ వాయిదా పడ్డాయి. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని హయ్యర్ ఎడ్యుకేషన్​ కౌన్సిల్ చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ప్రకటించారు. త్వరలోనే రీషెడ్యూల్​ రిలీజ్ చేస్తామన్నారు. బుధవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు, గురుకులాలు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించగా.. ఎగ్జామ్స్​ మాత్రం కొనసాగిస్తామని అన్ని యూనివర్సిటీలు చెప్పిన విషయం తెలిసిందే. వర్సిటీల ప్రకటనపై సీఎం కేసీఆర్ సీరియస్​ అయినట్టు తెలిసింది.వెంటనే ఎగ్జామ్స్ వాయిదా వేయాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించినట్టు సమాచారం. దీంతో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005 ప్రకారం డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏతో పాటు డిస్టెన్స్​ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ అన్నీ వాయిదా వేస్తున్నట్లు పాపిరెడ్డి తెలిపారు.  షెడ్యూల్ ​ప్రకారం ఈ నెల 24,25 తేదీల్లో పలు వర్సిటీల సెమిస్టర్లు ప్రారంభమై, వచ్చే నెల 15 వరకు ఉన్నాయి. సర్కారు ఆదేశాలతో ఎగ్జామ్స్​ను  వాయిదా వేస్తున్నట్టు వర్సిటీలు బుధవారం ప్రకటించాయి. 

కాలేజీలు తెరిస్తే కఠిన చర్యలు: ఉమర్​ జలీల్​

ఇంటర్ కాలేజీలను ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్  హెచ్చరించారు. సర్కారు ఆదేశాలు పాటించపోతే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామన్నారు.