హైదరాబాద్లో దంచి కొడుతున్న వర్షం..పలు చోట్ల ట్రాఫిక్ జామ్

హైదరాబాద్లో దంచి కొడుతున్న వర్షం..పలు చోట్ల ట్రాఫిక్ జామ్

హైదరాబాద్లో కుండ పోత వర్షం పడుతుంది. సిటీలోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది. గురువారం ( మే 16) న సాయంత్రం క్యుములో నింబస్ మేఘాల ప్రభావం తో హైదరాబాద్లో భారీ వర్షం పడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

హైదరాబాద్ లోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మియాపూర్, నిజాంపేట, జేఎన్టీయూ, కూకట్ పల్లి, కేపీహెచ్బీ, ముసాపేట, ఎర్రగడ్డ, ఎస్సాఆర్ నగర్, బొరబండ, మోతినగర్, మదాపూర్, జూబ్లీహిల్స్ వర్షం పడుతోంది. ఖైరతాబాద్, నాంపల్లి, మెహదీపట్నం, బంజారహిల్స్, పంజాగుట్ట, కోటి, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్ లో కూడా తేలిపాటి వానలు పడ్డాయి. రోడ్లపైకి నీరు చేరడం, వర్ష ప్రభావంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

జీడిమెట్ల, సికింద్రాబాద్ ఏరియాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. జగద్గిగిరిగుట్ట, బాలానగర్, మేడ్చల్, కీసర ఏరియాల్లోనూ భారీ వర్షం కొడుతోంది. కుత్బుల్లార్, మల్కాజిగిరి, ఆల్వాల్ ఏరియాల్లోనూ ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. సిటీలో క్యూముల నింబస్ మేఘాలు ఏర్పడ్డాయని.. వీటితో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన కొద్ది గంటల్లోనే సిటీలో భారీ వర్షం మొదలైంది. క్యుములో నింబస్ మేఘాల కారణంగా ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. రోడ్లపైకి నీరు చేరడం, వర్ష ప్రభావంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు మెల్లగా కదులుతూ వెళ్లడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.