పేపర్ లీకేజీ కేసు : మరో 13 మంది అభ్యర్థులపై TSPSC వేటు

 పేపర్ లీకేజీ కేసు :  మరో 13 మంది అభ్యర్థులపై TSPSC వేటు

పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన వారిపై టీఎస్పీఎస్సీ కఠిన చర్యలు చేపడుతుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న  37 మంది అభ్యర్థులను డీబార్ చేసిన టీఎస్పీఎస్సీ తాజాగా మరో  13 మంది అభ్యర్థులను డిబార్  చేసింది.  దీంతో ఈ సంఖ్య 50కు చేరుకుంది.  ఇకపై టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా నిషేధించింది. 

 వేటుకు గురైన అభ్యర్థులు రెండు రోజుల్లో వివరణ ఇవ్వొచ్చని తెలిపింది. లేకపోతే శాశ్వతంగా వారిని డిబార్ చేస్తామని స్పష్టం చేసింది కమిషన్. ఈ మేరకు ఓ ప్రకటనను రిలీజ్ చేసింది.  టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో దర్యాప్తు సాగేకొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

అక్రమ మార్గంలో పేపర్ సంపాదించిన అభ్యర్థులు.. సమాధానాలు తెలుసుకునేందుకు ఏఐ టెక్నాలజీ వినియోగించినట్లు సిట్ గుర్తించింది. లీకేజీకి పాల్పడిన అభ్యర్థులు ChatGPT ను వినియోగించినట్లు విచారణలో తేలింది.


 డిబారైన అభ్యర్థుల పేర్లు 

  • పూల రవి కిశోర్
  • రాయపుర విక్రమ్
  • రాయపురం దివ్య
  • ధనావత్ భరత్ నాయక్
  • పశికంటి రోహిత్ కుమార్
  • గాదె సాయి మాధు
  • లోకిని సతీష్ కుమార్
  • బొడ్డుపల్లి నర్సింగ్ రావు
  • గుగులోత్ శ్రీను నాయక్
  • భూక్య మహేష్
  • మూఢావత్ ప్రశాంత్
  • వదిత్యా నరేష్
  • పూల రమేష్ కుమార్