తెలంగాణ అథ్లెట్ నిత్యకు మరో గోల్డ్ మెడల్

తెలంగాణ అథ్లెట్ నిత్యకు మరో గోల్డ్ మెడల్

హైదరాబాద్, వెలుగు: ఫెడరేషన్ కప్ నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ అథ్లెట్ గంధె నిత్య రెండో గోల్డ్ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించింది. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 100 మీటర్ల ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్వర్ణం గెలిచిన ఆమె.. 200 మీటర్ల రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. కొచ్చిలో గురువారం జరిగిన 200 మీ. ఫైనల్లో నిత్య 23.68 సెకండ్లలో రేస్ పూర్తి చేసి టాప్ ప్లేస్ సాధించింది. తమిళనాడుకు చెందిన ఏంజెల్ సిల్వియా 23.91 సెకండ్లతో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రజతం నెగ్గింది. కర్నాటక అథ్లెట్  సుధీక్ష 24.31 సెకండ్లతో కాంస్యం ఖాతాలో వేసుకుంది.