హైదరాబాద్‏లో మరో సూడాన్ వాసికి ‘ఎబోలా’ నెగిటివ్

హైదరాబాద్‏లో మరో సూడాన్ వాసికి ‘ఎబోలా’ నెగిటివ్

పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రిలోని స్టేట్ ఎబోలా ఐసోలేషన్ సెంటర్‎లో చికిత్స పొందుతున్న మరో సూడాన్​వాసికి కూడా ఎబోలా నెగెటివ్​వచ్చిందని సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఎబోలా లక్షణాలతో రెండు రోజుల క్రితం ఐసోలేషన్ సెంటర్‎లో చేరిన అబ్దుల్ రఫీ మహమ్మద్​ఆదమ్ ఇస్సా అనే యువకుడికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో వైరస్​లేదని తేలిందన్నారు. ఇదివరకే ఒకరికి నెగెటివ్​వచ్చిందని, మరోసారి ఈ ఇద్దరికీ వైద్య పరీక్షలు చేసి, నెగిటివ్​ వస్తే డిశ్చార్జి చేస్తామని పేర్కొన్నారు.