రాజ్యసభలో మరో ముగ్గురు సస్పెండ్..మొత్తం 27 మంది

రాజ్యసభలో మరో ముగ్గురు సస్పెండ్..మొత్తం 27 మంది

రాజ్యసభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఆప్ రాజ్యసభ సభ్యులు సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ పాఠక్ సహా ఇండిపెండెంట్ ఎంపీ అజిత్ కుమార్ భుయాన్ లను  ఈ వారం సభా కార్యకలాపాల నుంచి  సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. దీంతో రాజ్యసభలో సస్పెండ్ అయిన విపక్ష సభ్యుల సంఖ్య 23కి చేరింది. లోక్ సభలో నలుగురు, రాజ్యసభలో 23మందితో కలుపుకుని మొత్తం 27మంది సభ్యులు సస్పెండ్ అయ్యారు.  

కాగా సస్పెన్షన్లకు నిరసనగా పార్లమెంటు ప్రాంగణంలోనే 20 మంది రాజ్యసభ ఎంపీలు రిలే దీక్షకు దిగారు. రాత్రుళ్లు కూడా అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. మిస్ బిహేవియర్ పై విచారం వ్యక్తం చేసినట్లయితే సస్పెన్షన్ ఎత్తివేతను పరిశీలిస్తామని  కేంద్రం తెలిపింది. లోక్ సభలో నలుగురు, రాజ్యసభలో 23మంది సభ్యులు సస్పెండ్ అయ్యారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుతో మల్లికార్జున ఖర్గే సహా 10 మందివ విపక్ష నతేలు భేటీ అయి, సస్పెన్షన్లు తొలగించాలని కోరారు. బేషరతుగా సస్పెన్షన్ ను ఎత్తివేస్తే మంచిదని సూచించారు. చేసిన తప్పును సభ్యులు ఒప్పుకుంటేనే స్సపెన్షన్లు ఎత్తివేస్తామని చైర్మన్ స్పష్టం చేయగా..దానికి నేతలెవరూ అంగీకరించలేదు.