- రూ.488 కోట్లతో నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
హైదరాబాద్‌సిటీ, వెలుగు : నగరం నుంచి నేరుగా ఔటర్ను కలుపుతూ కొత్తగా మరో ట్రంపెట్ ఫ్లై ఓవర్నిర్మాణానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. బుద్వేల్లేఔట్నుంచి ఓఆర్ఆర్, రేడియల్రోడ్2కు లింక్చేస్తూ ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. దీంతో రాబోయే రోజుల్లో సిటీ నుంచి నేరుగా ఔటర్ వరకూ..అక్కడి నుంచి రేడియల్రోడ్ల మీదుగా ట్రిపుల్ఆర్వరకూ ప్రయాణాలు సులభతరం కానున్నాయి.
కోకాపేటలోని నియోపోలిస్‌లో నిర్మించిన ట్రంపెడ్ ఫ్లై ఓవర్మాదిరిగానే రేడియల్రోడ్–2ను ఔటర్‌రింగ్‌రోడ్143వ కి.మీ.వద్ద కలిసేలా ఈ ఫ్లై ఓవర్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఓఆర్ఆర్వరకూ కనెక్టివిటీని పెంచేందుకే ఈ కొత్త ప్రాజెక్టు చేపట్టనున్నట్టు హెచ్ఎండీఏ అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించి అడ్మినిస్టేషన్శాంక్షన్ కూడా ప్రభుత్వం నుంచి లభించింది.
రూ.488 కోట్ల ఖర్చు
ఈ ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్ నిర్మాణానికి రూ.488 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. బుద్వేల్ లేఅవుట్‌తో పాటు రాబోయే మూసీ నది రివర్ఫ్రంట్కూ కనెక్టివిటీని అందిస్తుందంటున్నారు. ఇటు ఎయిర్‌పోర్ట్‌కు కానీ, అటు కోకాపేట వరకూ ట్రాఫిక్ ఇబ్బంది ఉండదని చెప్తున్నారు.
రేడియల్ రోడ్–2, ఓఆర్ఆర్, గచ్చిబౌలి, ఓఆర్ఆర్– శంషాబాద్ – రాజీవ్ గాంధీ విమానాశ్రయం, బుద్వేల్ మధ్య ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమవుతారని స్పష్టం చేస్తున్నారు. ప్రాజెక్టు డీపీఆర్పూర్తయ్యిందని, టెండర్ దశలో ఉందంటున్నారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులను హెచ్ఎండీఏ అంతర్గత నిధుల ద్వారా సమకూర్చుకుంటామని వెల్లడించారు.
