వామిక ఫొటోలు బయటకు రావడంపై ఫ్యాన్స్ ఆగ్రహం

వామిక ఫొటోలు బయటకు రావడంపై ఫ్యాన్స్ ఆగ్రహం

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూతురు వామిక ఫస్ట్ ఫొటోలు బయటకు రావడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో గ్యాలరీలో ఉన్న అనుష్క శర్మ, వామికలను కెమెరాలో చూపించడంపై మండిపడుతున్నారు. ఇన్నాళ్లు గోప్యంగా ఉంచిన వామిక ఫొటోలు బాహ్య ప్రపంచానికి తెలియడతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాటిని వెంటనే సోషల్ మీడియా నుంచి తీసివేయాలని డిమాండ్ చేశారు.  విరాట్ , అనుష్క శర్మ ఎవరి కంట పడకుండా చాలా జాగ్రత్తగా కోడి పిల్లను దాచేసినట్టు తమ కూతురు వామికను చూపించలేదు. కానీ సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ లో విరాట్ కూతురు వామిక కెమెరాకు చిక్కింది. కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా వీరిద్దరూ స్టాండ్స్ లో కూర్చుని ఎంకరేజ్ చేశారు. విరాట్ అర్ధశతకం అందుకోగానే కూతురుకి కోహ్లీని చూపిస్తూ చప్పట్లు కొడుతూ కనిపించారు. అదే సమయంలో అటుగా కెమెరా కన్ను వెళ్లడంతో.. తొలిసారి వామికాని ప్రపంచం చూసింది. 2021, జనవరి 11న జన్మించిన వామికాను ప్రపంచానికి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ చూపించలేదు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో అనుష్క శర్మ, విరాట్ తమ కూతురు వామిక బర్త్ డే వేడుకలు జరుపుుకున్నారు. తొలిసారి వామిక ఫొటోలు లీక్ అవ్వడంతో కోహ్లీ అభిమానులు మాత్రం చాలా హర్ట్ అయ్యారు.