ప్రతిపక్షాల ఐక్యవేదికలో మనస్పర్థలు

ప్రతిపక్షాల ఐక్యవేదికలో మనస్పర్థలు
  • ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ సంకోచిస్తోందన్న ఆప్
  •  కలిసి అడుగులు వేయలేమని వెల్లడి
  • సీపీఎం ఉంటే మేం రామంటున్న దీదీ
  • కేరళలో కాంగ్రెస్ తోనే ఫైట్ అన్న సీపీఎం

ఢిల్లీ: ప్రతిపక్షాల ఐక్యవేదిక సమావేశం జరిగి 24 గంటలు గడవక ముందే నేతల్లో మనస్పర్థలు  వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను పార్లమెంటులో వ్యతిరేకించేందుకు కాంగ్రెస్ వెనుకాడుతోందని, 31 మంది ఎంపీలున్న కాంగ్రెస్ పార్లమెంటులో ముక్తకంఠంతో అడ్డుకోవాలని, అప్పుడే తాము విపక్ష కూటమిలో కొనసాగుతామని ఆప్ ప్రకటించింది. దీనిపై ఇవాళ ఆప్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ విషయంలో  ఢిల్లీ ప్రజల పక్షాల నిలుస్తారో లేదో కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాలని ఆప్ పేర్కొంది. దీనిపై స్పందించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవించడం, విభేదించం పార్లమెంటు బయట జరగవని, ఇప్పుడు ఆప్ దీనిని ఎందుకింత ప్రచారం చేస్తుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.

ALSO READ:త్వరలో 33 నియోనాటల్ అంబులెన్స్ లు.. నీలోఫర్ ఆసుపత్రిలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ప్రారంభం

ఇదిలా ఉండగా కూటమిలో సీపీఎం ఉండటాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశం తర్వాత కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. సీపీఎంతో కలిసి తాము పనిచేయాలేమని స్పష్టం చేశారు. తమకు కేరళలో కాంగ్రెస్ కూటమి(యూడీఎఫ్​) ప్రత్యర్థి అని, బీజేపీని గద్దె దించాలనే విషయంలో తాము సానుకూలంగా ఉన్నా.. ఆ రాష్ట్రం విషయంలో మాత్రం తాము కాంగ్రెస్ తో దూరాన్ని పాటిస్తామని సీపీఎం తెలిపింది. జాతీయ స్థాయిలో పొత్తు సాధ్యం కాదని, రాజకీయ అంశాలపై ఉమ్మడి వైఖరిని అవలంబించ వచ్చునని పేర్కొన్నది. ఈ పరిణామాలతో ఐక్యవేదిక ఏర్పాటుకు కొంత విఘాతం కలిగినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.