త్వరలో 33 నియోనాటల్ అంబులెన్స్ లు.. నీలోఫర్ ఆసుపత్రిలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ప్రారంభం

త్వరలో 33 నియోనాటల్ అంబులెన్స్ లు..  నీలోఫర్ ఆసుపత్రిలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ప్రారంభం

రాష్ట్రంలో శిశు మరణాలు తగ్గించేందుకు నీలోఫర్ ఆసుపత్రిలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ని ప్రారంభించామన్నారు  మంత్రి హరీశ్ రావు.  తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 44 SNCU (స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్) లను అనుసంధానం చేస్తూ నీలోఫర్ ఆసుపత్రిలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ సెంటర్  హబ్ గా పనిచేయనుందని ఆయన  తెలిపారు. 24 గంటల పాటు అప్పుడే పుట్టిన పిల్లల ట్రీట్ మెంట్ ను ఇక్కడి నుంచి మానిటరింగ్ చేస్తామన్నారు. 33 నియో నాటల్ అంబులెన్స్ లను  అందుబాటులోకి తెచ్చి .. వాటి కోసం  ప్రతి సంవత్సరం ప్రభుత్వం 10 కోట్ల రూపాయిలు ఖర్చు పెడుతుందన్నారు  మంత్రి హరీశ్ రావు.

అప్పుడే పుట్టిన పిల్లలు కొందరు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని...అలాంటి  వారికి స్పెషల్ కేర్ తీసుకునే  నీలోఫర్ ఆసుపత్రిలో సెంటర్ఆఫ్ఎక్సలెన్స్ ప్రారభించుకున్నామన్నారు. ఎక్కడో దూరంలో ఉన్న పిల్లలు క్రిటికల్ కేసులు ఉన్న వారు దారిలోనే చనిపోతున్నారు. అలాంటి పిల్లలకు  అక్కడే  ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఈ సెంటర్ ని ఏర్పాటు చేసామన్నారు మంత్రి హరీశ్ రావు. ఇక్కడి నుంచి వీడియో లు చూస్తూ వారికి వైద్యం చేస్తారంటూ...ప్రజలు పట్ల డెడికేటెడ్ గా పని చేసే వైద్యులు నీలోఫర్ లో ఉన్నారు.

ALSO READ:బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా గండ్ర నళిని

ఇలాంటి సెంటర్ భారత దేశంలో ఎక్కడ లేదంటూ.. . సీఎం కేసీఆర్ న్యూట్రషన్ కిట్, కేసీఆర్ కిట్ ఇస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అంగన్ వాడి లో ప్రత్యేకముగా పాలు, గుడ్లు అందిస్తున్నామన్నారు. 500కోట్లతో ఎమ్ సీహెచ్ ని ఆధునీకరించడం, కేసీఆర్ కిట్, న్యూట్రషన్ కిట్ లాంటి పథకాలను సీఎం కేసీఆర్  ప్రవేశ పెట్టారన్నారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో  డెలివరీల సంఖ్య 70 శాతానికి పెరిగిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.