సిటీలో రిపబ్లిక్ డే వేడుకలు.. మది నిండుగా.. జెండా పండుగ

సిటీలో రిపబ్లిక్ డే వేడుకలు.. మది నిండుగా.. జెండా పండుగ

సిటీలో రిపబ్లిక్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. గవర్నమెంట్ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలతో పాటు వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జీహెచ్ఎంసీ హెడ్​ ఆఫీస్​లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతతో కలిసి కమిషనర్ కర్ణన్ జాతీయ జెండాను ఎగరవేశారు. 

హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్​ కలెక్టరేట్​లలో ఆయా కలెక్టర్లు దాసరి హరిచందన, నారాయణరెడ్డి, ప్రతీక్ జైన్, మను చౌదరి, హెచ్ఎండీఏ ఆఫీస్​లో మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, మెట్రో వాటర్​బోర్డు ఆఫీస్​లో ఎండీ అశోక్ రెడ్డి, సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్​కాంప్లెక్స్​లో రైల్వే జీఎం సంజయ్​ కుమార్​శ్రీవాస్తవ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.– వెలుగు, నెట్​వర్క్