వందేమాతరం గీతం 150 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ కొత్తగా స్వరపరిచిన వందేమాతరం గీతం గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పరేడ్ చివరల్లో ఆయన సమకూర్చిన కొత్త బాణీలకు అనుగుణంగా 2500 మంది కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. అలాగే తొలిసారి తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ కు చెందిన 133 మంది ఎన్ సీసీ కెడెట్లు ఈ వేడుకల్లో కవాతు చేశారు.
