వీబీ జీ రామ్ జీ రద్దు చేయాలి .భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి

వీబీ జీ రామ్ జీ రద్దు చేయాలి .భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి

జనగామ, వెలుగు: వీబీజీ రామ్​జీ చట్టాన్ని రద్దు చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి డిమాండ్​చేశారు. జనగామ మండలం ఓబుల కేశవాపురంలో సోమవారం నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన మాట్లాడా రు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఉపాధి హక్కును కాలరాస్తోందని ఆరోపించారు. 

గ్రామ పంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా లభించిన అధికారాలను నిర్వీర్యం చేసిందన్నారు. గతంలో ప్రజలు కోరగానే ఉపాధి లభించేదని, కొత్త చట్టంతో  కేంద్రం నోటిఫై చేస్తేనే పనికి గుర్తింపు లభిస్తుందన్నారు. ఇది ప్రజల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోం దని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టం కారణంగా కలిగే గ్రామీణ ప్రాంత ప్రజలకు కలిగే నష్టాలను ఆయన వివరించారు. 

ఈ ర్యాలీలో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ విశ్వనాథన్, జనగామ డీసీసీ అధ్యక్షురాలు లకావత్​ధన్వంతరి, నియోజకవర్గ ఇన్​చార్జ్​కొమ్మూరు ప్రతాపరెడ్డి, సర్పంచ్ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.