బషీర్‌బాగ్, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న నుమాయిష్ సందర్శకులతో కిక్కిరిసింది. వీకెండ్, రిపబ్లిక్ డే వరుస సెలవులతో నుమాయిష్ కు నగరవాసులు పోటెత్తారు. ఆదివారం 75 వేల మంది రాగా, సోమవారం 80 వేల మంది వచ్చారు.
నుమాయిష్ లో డ్రెస్సులు, ఇండ్లలోకి కావాల్సిన వస్తువులు, డ్రైఫ్రూట్స్, నిలోఫర్ కేఫ్ , పిస్తా హౌస్ ఇలా ప్రతి స్టాల్ వద్ద జనాల తాకిడి కనిపించింది. ఇప్పటి వరకు నుమాయిష్ ను 12 లక్షల మంది సందర్శకులు విజిట్ చేసినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు తెలిపారు.
