14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్.. బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్

14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్.. బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్

ఏపీ అసెంబ్లీలో మీసం తిప్పిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు స్పీకర్ తమ్మినేని సీతారాం వార్నింగ్ ఇచ్చారు. సభలో మీసాలు మెలేయడం సరికాదన్నారు.  సభా సంప్రదాయాలను పాటించాలని సూచించారు.   సభలో చేసిన మొదటి తప్పిదంగా భావించి క్షమిస్తున్నట్లు వెల్లడించారు. 

స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన 14 మంది టీడీపీ సభ్యులను  అసెంబ్లీ నుంచి  స్పీకర్ సస్పెండ్ చేశారు. 14 మంది సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన వారిలో  అచ్చెన్నాయుడు,ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్య, చినరాజప్ప, వెంకట్ రెడ్డి నాయుడు,  గద్దె రామ్మెహన్, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, బాలవీరాంజనేయస్వామి, శ్రీదేవి, అశోక్ సస్పెండ్ అయ్యారు.  కోటంరెడ్డి, అనగాని, పయ్యావులపై సెషన్ మొత్తం వేటు వేశారు. 

ఇవాళ  ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన  మొదటి రోజే.. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ ఎమ్మెల్యేలు గొడవకు దిగారు. సభను అడ్డుకున్నారు., స్పీకర్ పోడియం ఎదుట ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. 

వైసీపీ ఎమ్మెల్యేలను చూస్తూ వైసీపీ ఎమ్మెల్యేలకు సవాల్ చేశారు ఎమ్మెల్యే  బాలకృష్ణ. మీసం తిప్పారు.,. తొడ కొట్టారు. చంద్రబాబు అరెస్టు అక్రమం అని.. దేనికైనా రెడీ అన్నట్లు వైసీపీ ఎమ్మెల్యేలకు సవాల్ చేశారు. సభలో బాలయ్య మీసం తిప్పి.. తొడ కొట్టటాన్ని చూసిన వైసీపీ ఎమ్మెల్యేలు కౌంటర్ ఎటాక్ కు దిగారు.