జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటా..ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ వెల్లడి

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటా..ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో తానూ పాల్గొంటానని ఏపీ బీజేపీ చీఫ్​ పీవీఎన్ మాధవ్ ప్రకటించారు. శనివారం ఆయన బీజేపీ స్టేట్​ ఆఫీసులో తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, ఏపీ ప్రజలు బీజేపీకి రెండు కళ్లు అని అన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ ట్రైన్ లా ముందుకు సాగుతోందన్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో గూగుల్ లాంటి సంస్థలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో రెండు రాష్ట్రాల నేతలు కలిసికట్టుగా పనిచేసి బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి గెలుపునకు కృషి చేస్తామని చెప్పారు.