ఎమ్మెల్సీ కవితతో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు భేటీ

ఎమ్మెల్సీ కవితతో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు భేటీ

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఏపీ బీఆర్ఎస్ నేతలు కలిశారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సహా పార్టీ నాయకులు రావెల కిషోర్ బాబు, పార్థసారథి కవితను కలిశారు. ఏపీలో పార్టీ బలోపేతంతో సహా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. 

ఈ నెల 2వ తేదీన తోట చంద్రశేఖర్ కేసీఆర్ సమక్షంలో  బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ను కేసీఆర్ ప్రకటించారు. ఏపీలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఆయనకు సూచించారు. ఏపీలోనూ బీఆర్ఎస్ కు మంచి స్పందన లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్రాంతి తర్వాత ఏపీ బీఆర్ఎస్ ఆఫీసు.. తన ఆఫీసు కంటే బిజీ అయితదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ మీద పెద్ద బాధ్యత పెట్టామని.. దానికి ఆయన న్యాయం చేస్తారని కామెంట్ చేశారు.