ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు సీఐడీ నోటీసులు

V6 Velugu Posted on Mar 16, 2021

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు అందించారు. అమరావతిలో భూములు కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి ఆయనకు నోటీసులు అందించినట్లు తెలుస్తోంది. రెండు బృందాలుగా  హైదరాబాద్‌ వచ్చిన సీఐడీ అధికారులు చంద్రబాబు ఇంటికి వెళ్లి.. సెక్షన్ 41 సీఆర్పీసీ కింద నోటీసులు అందించారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై 120మ, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని సమాచారం. 

Tagged Hyderabad, andhrapradesh, Amaravathi

Latest Videos

Subscribe Now

More News